కొత్తవలసలో నాగులచవితి వేడుకలు
VZM: కొత్తవలస మండల కేంద్రంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగుల చవితి వేడుకలు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. దీపావళి వెళ్ళిన ఐదు రోజుల తరువాత వచ్చే నాగులచవితి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవడం పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుంది. నాగుల చవితి రోజు నాగేంద్రుడుని పూజిస్తే నాగ దోషాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం.