'మాకు డబ్బు, మద్యం వద్దు.. గుడి పూర్తి చేయండి'
NLG: చిట్యాల మండలం నేరడ ఓటర్లు మాకు మద్యం డబ్బులు వద్దు! కాలనీలోని గుడిని పూర్తి చేయండి! మా ఓట్లన్నీ నీకే అంటూ.. సర్పంచ్ అభ్యర్థులకు ఆఫర్ ఇస్తున్నారు. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి గుడిని పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని ఎస్సీ కాలనీ ఓటర్లు కోరుతున్నారు. ముందుగా గుడి ఖాతాలో డబ్బులు జమ చేసిన వారికి ఓట్లు వేస్తామని పేర్కొంటున్నారు.