నగరంలో 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం
HYD: పాతబస్తీలోని జియాగూడ రంగనాథస్వామి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. కుతుబ్‌షాహీలు భూమిని ఇవ్వగా, జీయర్ స్వామి ఇక్కడ రంగనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శ్రీరంగం, తిరుమల యాత్రల ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నుంచి సంక్రాంతి వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతాయని భక్తులు, ఆలయ అధికారులు తెలిపారు.