VIDEO: తెనాలిలో వృధాగా పోతున్న తాగునీరు
GNTR: తెనాలి పట్టణ ప్రజల దాహార్తీని తీర్చేందుకు ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పైపులైన్లకు అక్కడక్కడా లీకేజీలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రజక చెరువు పార్కు వంటి ప్రాంతాల్లో నీరు సరఫరా అయ్యే సమయంలో పైపుల నుండి నీరు వృథాగా రోడ్ల మీదకు చేరుతోంది. అధికారులు స్పందించి వెంటనే ఈ లీకేజీలకు మరమ్మతులు చేయించాలని మంగళవారం పట్టణ ప్రజలు కోరుతున్నారు.