సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మంగళవారం బేల మండలం జామినిలో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధికి నిదర్శనమని, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.