కుక్కల దాడిలో దుప్పి మృతి

MNCL: కుక్కల దాడిలో దుప్పి మృతి వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఊర కుక్కల దాడిలో దుప్పి మృతి చెందింది. నీలగిరి తోటలో మేత కోసం వచ్చిన దుప్పిని కుక్కలు ఒక్కసారిగా దాడి చేయగా తప్పించుకొని గ్రామ శివారులోని పంటపొలాలకు వచ్చింది. వెంబడించిన కుక్కలను గ్రామస్తులు తరిమికొట్టారు.