VIDEO: డైమండ్ పార్క్ వద్ద హత్య

VIDEO: డైమండ్ పార్క్ వద్ద హత్య

విశాఖలోని డైమండ్ పార్క్ ప్రాంతంలో బుధవారం దారుణం జరిగింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నివసించే చిరంజీవి (25) అనే యువకుడిని అతని స్నేహితుడు లక్ష్మణ రెడ్డి (25) కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతుడు చిరంజీవి దౌర్జన్య స్వభావం కలిగి, లక్ష్మణ రెడ్డిపై తరచుగా ఆధిపత్యం చెలాయించేవాడని, వేధింపులు తట్టుకోలేక ఈ హత్య జరిగినట్లు సీఐ తెలిపారు.