శ్రీరాంపురం బడి.. సమస్యలకు ఒడి.!

BDK: బూర్గంపాడు (M) సారపాక పంచాయతీ శ్రీరాంపురం ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది, వర్షం పడితే వంటగది కురుస్తుందని వారు మంగళవారం హిట్ టీవితో వాపోయారు. బడిలో ఏడాది కింద బోరు మరమ్మతుకు గురి కావడంతో మధ్యాహ్న భోజనానికీ అవస్థలు పడుతున్నామని కార్మికురాలు షర్మిల భాయ్ చెప్పారు.