ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లో నేడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచిత ఈసీజీ, రక్త, మూత్ర పరీక్షలను నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.