టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు

టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు

NRML: పంటకు ఎరువులు వేయాలన్న, పండిన పంటను అమ్ముకోవలన్న రైతుకు తిప్పలు తప్పడం లేదు. కుబీర్, తానురు, ప్రాథమిక సహకార సంఘాల వద్ద టోకెన్ల కోసం రైతులు శనివారం తెల్లవారుజామునుంచే బారులు తీరారు. నేటి నుంచి సోయ పంటను విక్రయించుకోవడానికి టోకెన్లను పంపిణీ చేస్తున్నట్లు సమాచారాన్ని ఒకరికొకరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, పురుషులు సైతం బారులు తీరారు.