భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి

SRCL: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా రుద్రంగి, మానాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.