చిట్వేల్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద వర్షపు నీరు
అన్నమయ్య: చిట్వేల్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీస్ గేటు వరకు నీరు చేరడంతో లోపలికి వెళ్లే వారికి భయాందోళనలు నెలకొన్నాయి. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.