రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన
GNTR: ఫిరంగిపురం మండలంలోని రేపూడి, నుదురుపాడు, వేములూరిపాడు అమీనాబాద్ గ్రామాల్లో శుక్రవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. రేపూడిలో జరిగిన సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ వి. శంకర్, ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ప్రసాద్ రావు, మండల వ్యవసాయ అధికారి వాసంతి పాల్గొన్నారు. రైతులకు అమలవుతున్న కార్యక్రమాలను శంకర్ తెలిపారు.