నేటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌

నేటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌

WNP: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి చికెన్ దుకాణాలను మూసివేస్తున్నట్లు చికెన్‌ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది. చికెన్‌ విక్రయాల్లో తమ మార్జిన్‌ పెంచాలన్న డిమాండ్‌ను పౌల్ట్రీ కంపెనీలు పట్టించుకోనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ యజమానులు రిటైల్‌ దుకాణాలకు కిలో మీద రూ.16 మార్జిన్‌ తగ్గించినట్లు వారు పేర్కొన్నారు.