శ్రీలంక నుంచి నలుగురు మత్స్యకారులు విడుదల

AP: కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపడంతో నలుగురు మత్స్యకారులు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లారు. దీంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ వారిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఆ నలుగురిని ఇటీవలే విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో రెండు రోజుల్లో సముద్ర మార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నట్లు సమాచారం.