'ప్రజలకు సురక్షితమైన నీటిని అందించడమే లక్ష్యం'
ELR: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో రూ.48 కోట్ల వ్యయంతో 'అమృత్ 2.0' పథకం కింద త్రాగునీటి పనులు చేపట్టనున్నట్లు MLA రోషన్ కుమార్ వెల్లడించారు. ఇవాళ మున్సిపల్ ENC ప్రభాకర్ రెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ప్రజలకు సురక్షితమైన నీటిని త్వరితగతిన అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను కోరారు.