VIDEO: జాతరలో యువతతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే
W.G: తాడేపల్లిగూడెం బలుసులమ్మ జాతరలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు యువతతో కలిసి స్టెప్పులు వేశారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఎమ్మెల్యే ఒక్కసారిగా స్టెప్పులు వేయడంతో కార్యకర్తలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జాతరకు విశేష స్పందన రావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.