ప్రొఫెసర్ ఈసం నారాయణ ప్రత్యేక పూజలు
MHBD: కొత్తగూడ మండలంలోని శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభమైంది. జాతర సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్, జాతర కమిటీ చైర్మన్ భూర్క నరేందర్, పూజారులు తోలెం చిన్న నర్సయ్య, వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న, కిరణ్ కుమార్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.