మునిసిపాలిటీలో నత్తనడకన పన్నుల వసూళ్లు

మునిసిపాలిటీలో నత్తనడకన పన్నుల వసూళ్లు

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను, VLT వసూళ్లు మందకోడిగా సాగుతున్నాయి. దాదాపు రూ.9.5 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా నేటికీ కేవలం 50% మాత్రమే వసూలైనట్లు అధికారులు తెలిపారు. మొండి బకాయిలే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అపరాధ రుసుముపై 50% రాయితీ ఉందని, వసూళ్లకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రాత్రి 8 గంటల వరకు విధలు నిర్వహిస్తున్నామని ప్రజలు గమనించాలని సూచించారు.