పాక్ కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి

LOC వెంబడి ఉన్న యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులకు ప్రతిస్పందనగా.. పాక్ సైన్యం LOC వెంబడి ఉన్న భారత్ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మోటార్ షెల్స్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది.