VIDEO: చందాపురంలో ఫుడ్ పాయిజన్... 50 మందికి అస్వస్థత
NTR: నందిగామ మండలం చందాపురం గ్రామంలో శ్రీరామనవమి అన్నదానంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుమారు 50 మంది గ్రామస్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైన వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. నిన్న నిర్వహించిన భోజనాలు, టిఫిన్లు తీసుకున్న వారిలో ఈ సమస్యలు తలెత్తాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.