మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి
గుంటూరు: మహానటి సావిత్రి జన్మస్థలమైన గుంటూరు, తాడేపల్లి మండలంలోని చిర్రావూరులో ఆమె పేరుతో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈ నిర్మాణానికి NTPC తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేసిందన్నారు. తాను తెనాలి ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించానని, సావిత్రి 90వ జయంతి సందర్భంగా బాలశౌరి తెలిపారు.