రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

NLG: రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్ పోటీలకు హాలియాలోని ఆకాంక్ష పాఠశాల విద్యార్థి ఆర్. పవన్‌కుమార్ ఎంపికయ్యాడు. గత నెల 29న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన 600 మీటర్ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల HM మోదాల రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మోహన్ రావు, డైరెక్టర్లు, పవన్‌కుమార్‌ను అభినందించారు.