ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
AKP: మహిళ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ జీఓ సంక్రాంతి లోగా జారీ అయ్యేవిధంగా కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం కసింకోట శారదా వనంలో పీఆర్టీయూ నిర్వహించిన వన సమారాధనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పదవ తరగతి వందరోజుల ప్రణాళికలో సెలవులను మినహాయించాలని సూచించారు.సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.