తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

JN: తాటి చెట్టుపై నుంచి కింద పడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన వావిలాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోతి అనిల్ కులవృత్తులో భాగంగా తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు చేతులు విరిగాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.