'ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

KMM: రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు సంజీవరావు అన్నారు. ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు PHC ఎదుట ఆశవర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి ప్రశాంత్‌కు వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనంగా ఆశ వర్కర్లకు నెలకు రూ.18 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు.