పౌష్టికాహారంతోనే సికిల్ సెల్ ఎనీమియాకు చెక్: దొన్ను దొర
ASR: పౌష్టికాహారం ద్వారా సికిల్ సెల్ ఎనీమియాను జయించవచ్చని టీడీపీ అరకు ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర తెలిపారు. అరకులో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.