మీడియాపై ట్రంప్ ఫైర్.. తన ప్రతినిధిపైనే జోకులు
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌పై US అధ్యక్షుడు ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. తనకు 97% ప్రతికూల వార్తలు వస్తున్నాయని, ఆమె సరిగ్గా పని చేయడం లేదని.. ఆమెను తీసేయాలా? అని నవ్వుతూ ప్రశ్నించారు. అయితే వెంటనే ఆమె అద్భుతంగా పనిచేస్తోందని, చరిత్రలోనే బెస్ట్ సెక్రటరీ అని ప్రశంసించారు. తనపై మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నా, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు.