డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఆవరణలో 'స్వచ్ఛ ఆర్మూర్'
NZB: ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన 'స్వచ్ఛ ఆర్మూర్' కార్యక్రమం నేటితో 48వ ఆదివారానికి చేరుకుంది. సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ నేతృత్వంలో జిరాయత్ నగర్ కాలనీలోని డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. "ప్రతి ఆదివారం ఒక గంట" అనే నినాదంతో ఈ ఉద్యమం విజయవంతంగా సాగుతోందన్నారు.