రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, అందులో భాగంగానే డ్రైనేజ్‌ల వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.