రేపు రాజరాజేశ్వర, భీమేశ్వర ఆలయాల మూసివేత

రేపు రాజరాజేశ్వర, భీమేశ్వర ఆలయాల మూసివేత

SRCL: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామితో పాటు, భీమేశ్వర స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించి, ఆలయం అంతట సంప్రోక్షణ చేస్తామన్నారు.