కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన కలెక్టర్
SRCL: కుక్క కాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు.