100 రోజులు.. 100 తరగతి గదులు

100 రోజులు.. 100 తరగతి గదులు

PLD: జిల్లాలో “మనబడి–మన భవిష్యత్తు” కార్యక్రమంలో భాగంగా పాఠశాలల నిర్మాణ, మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజులు.. 100 తరగతి గదులు నినాదంతో పని చేయాలని సూచించారు.