తొర్రూరులో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 5వ వార్డులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.