ప్రముఖ నటుడిపై పోలీసులకు ఫిర్యాదు

MNCL: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై బంజారా యువజన సేవా సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం వారు జన్నారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ గిరిజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.