కో-ఆప్షన్ మెంబర్ల ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం

కో-ఆప్షన్ మెంబర్ల ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఇద్దరు కో-ఆప్షన్ మెంబర్లను ఎన్నుకోనున్నట్లు కమిషనర్ సంపత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో పరిజ్ఞానం, అనుభవం, అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు (ఒకరు మహిళ) సభ్యులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలను జతపరిచి ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు మున్సిపల్ ఆఫీస్‌లో ఇవ్వాలన్నారు.