రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుని ముందస్తు అరెస్ట్
Srcl: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిని గురువారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రెడ్డిల హక్కుల సాధన కోసం రెడ్డి రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండారం కృష్ణారెడ్డిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.