'పాడి పరిశ్రమకు రాయితీతో రుణాలు'

'పాడి పరిశ్రమకు రాయితీతో రుణాలు'

ప్రకాశం: తాళ్లూరు వెలుగు కార్యాలయంలో గురువారం జీవనోపాధుల సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో అమరావతి CERP నుంచి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ మూర్తి, బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. మండలంలో పాల ఉత్పత్తి బాగుందన్నారు. రూ.2లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 35 % రాయితీతో రుణాలు పొందవచ్చన్నారు. మహిళలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో APM దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.