విద్యార్థులకు తప్పని తరగతి కష్టాలు

విద్యార్థులకు తప్పని తరగతి కష్టాలు

KDP: ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం 'నాడు-నేడు' కింద కొత్త తరగతిగదుల పనులుచేపట్టారు. ఆ తర్వాత పనులు మరుగున పడ్డాయి. ప్రస్తుతం పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి పనులు పూర్తి చేయాలని విద్యార్థులు కోరారు.