హెల్మెట్ ధరించని వాహనిదారులకు చలాన్లవిధింపు
BHNG: యాదగిరిగుట్ట ట్రాఫిక్ పీఎస్ పరిధిలో వంగపల్లి NH-163 హైవే పై హెల్మెట్ ధరించని వాహనదారులను చలాన్లు విధించినట్లు ట్రాఫిక్ సీఐ ఎలకొండ కృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ అక్షయన్స్ యాదవ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వాహనాలను తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. హెల్మెట్ ధరించని 44 మంది వాహనదారులకు చలాన్లు విధించినట్లు వెల్లడించారు.