మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను సత్కరించిన కమిషనర్

మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను సత్కరించిన కమిషనర్

SDPT: చేర్యాల కానిస్టేబుల్ తాండ్ర స్వామి చేసిన సాహసం ప్రజల ప్రశంసలు పొందింది. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా పోలీస్ కమిషనర్ బి.అనురాధ ప్రశంసా పత్రం, నగదు రివార్డుతో సత్కరించారు. గత మంగళవారం చేర్యాల చెరువులో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళను, కానిస్టేబుల్ స్వామి వెంటనే నీటిలో దూకి రక్షించారు. ఆయన ధైర్యసాహసాలను కమిషనర్ అభినందించారు.