'రైతులకు నీటి సమస్య రాకుండా చూడాలి'
VKB: రైతులకు నీటి సమస్య రాకుండా వ్యవసాయ పనులు సాగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సొసైటీ ఛైర్మన్ కనకం మొగులయ్య కోరారు. కుల్కచర్లలోని కాముని చెరువు గండి పడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కట్ట ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు.