బస్సుని ఢీకొని.. వ్యక్తికి గాయాలు

MDK: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మెదక్ వైపు వస్తున్న బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.