బాల త్రిపుర సుందరి అమ్మవారికి 800 గ్రాముల వెండి విరాళం
W.G: భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠం కోసం మంగళవారం దాతలు 800 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. గ్రంధి చిన్నతాతరావు దంపతులు 500 గ్రాములు, ఏడిద సుబ్బారావు దంపతులు 100 గ్రాములు, కూరేళ్ల శ్రీనివాస్ దంపతులు 100 గ్రాములు, చల్లాస్ శ్రవణ్ శ్రీనివాస్ దంపతులు 100 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు.