పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
PPM: పాచిపెంట పోలీస్ స్టేషన్‌లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కే.సీతం నాయుడుకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ గురువారం న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.