వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
MHBD: తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని SP శబరిష్ సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిసార్లు పొగ మంచు ఎక్కువగా ఉంటే వాహనాలు ఆపాలన్నారు. నిర్దిష్ట వేగంతో వాహనాలను నడపడం వల్ల స్లిప్పరీ రోడ్ల నుంచి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చన్నారు.