ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

HNK: జిల్లాలోని కమలాపూర్ మండలం గూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని, తేమ శాతాన్ని పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం తూకం వేశారని, మిల్లులకు ఎంత తరలించారనే వివరాలను నిర్వాహకులు, అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.