రిపోర్టర్‌కు ఇషాన్ కిషన్ కౌంటర్
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా సభ్యులు ఆలయాలను సందర్శించడంపై కీర్తి ఆజాద్ చేసిన విమర్శలను ఇషాన్ కిషన్ తోసిపుచ్చాడు. దీనిపై ప్రశ్నించిన రిపోర్టర్‌కు.. 'ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడగొద్దు. ఇంతటి ఘన విజయం గురించి మంచి ప్రశ్నలు వేయండి' అని బదులిచ్చాడు. కీర్తి ఆజాద్ చేసిన ‘షేమ్ ఆన్ టీమిండియా’ వ్యాఖ్యలపై ఇషాన్ స్పందించిన తీరు ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది.