చెరువును తలపిస్తున్న బ్రాడిపేట ప్రధాన రహదారి
గుంటూరులోని మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బ్రాడిపేట ప్రధాన రహదారి చెరువును తలపించింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షపు నీరు రోడ్లపై నిలవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.