రహదారి నిర్మించాలని కోరుతూ వైసీపీ నిరసన

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ప్రధాన రహదారి నిర్మించాలని కోరుతూ వైసీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాస్ పాల్గొని కూటమి ప్రభుత్వంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. గ్రామంలో ప్రధాన రహదారి గోతులు మయంగా తయారైందని పేర్కొన్నారు.